AUSW v NZW WC : వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆసిస్ జైత్ర‌యాత్ర‌

న్యూజిలాండ్ పై వరుస విక్ట‌రీ

AUSW v NZW WC  :  ఐసీసీ వ‌న్డే మ‌హిళ‌ల వ‌రల్డ్ క‌ప్ -2022 లో ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు(AUSW v NZW WC )త‌న జైత్ర యాత్ర‌ను కంటిన్యూ చేస్తోంది. న్యూజిలాండ్ లోని వెల్లింగ్ట‌న్ వేదిక‌గా కీవీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఏకంగా 144 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

భారీ టార్గెట్ ముందుంచింది ఆసిస్. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 270 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు ఏకంగా 128 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దీంతో భారీ తేడాతో విక్ట‌రీ సాధించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది ఆస్ట్రేలియా జ‌ట్టు.

ఇప్ప‌టికే ఆ జ‌ట్టు అన్ని ఫార్మాట్ ల‌లో టాప్ లో ఉంది. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే వెస్టిండీస్ పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. కీవీస్ తో ఓట‌మి పాలైంది. అంత‌కు ముందు దాయాది పాకిస్తాన్ పై నెగ్గింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఆసిస్ బౌల‌ర్లు మ‌రోసారి త‌మ స‌త్తా చాటారు. డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు ప‌డ‌గొడితే వెల్లింగ్ట‌న్ , గార్డెన‌ర్ ఇద్ద‌రూ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ టీమ్ లో వైట్ ఒక్క‌రే 44 ప‌రుగులు చేసి ప‌ర్వాలేద‌నిపించింది.

లేక పోతే త‌క్కువ స్కోర్ కే కుప్ప కూలేది. మిగ‌తా బ్యాట‌ర్లు అలా వ‌చ్చి ఇలా వెళ్లారు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ 269 ర‌న్స్ చేసింది. ఆ టీమ్ లో పెర్రీ 68 ర‌న్స్ చేస్తే త‌హ్లియా 57, గార్డెన‌ర్ 48 ప‌రుగులు చేసి దుమ్ము రేపారు.

Also Read : ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్

Leave A Reply

Your Email Id will not be published!