Australia Record : ఆస్ట్రేలియా అరుదైన రికార్డ్
వరుసగా ఆరోసారి విశ్వవిజేత
Australia Record T20 World Cup Final : దక్షిణాఫ్రికా వేదికగా నెల రోజుల పాటు జరిగిన క్రికెట్ సంబురం ముగిసింది. ఎట్టకేలకు బలమైన ఆస్ట్రేలియా మరోసారి విజేతగా(Australia Record) నిలిచింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 వరల్డ్ కప్ 2023ను కైవసం చేసుకుంది. ప్రత్యర్థి ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి వరుసగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా నేరుగా ఫైనల్ కు చేరుకుని కప్ తనదేనని చాటి చెప్పింది.
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ లలో ఏకంగా ఆరుసార్లు ఛాంపియన్ గా నిలిచి అరుదైన రికార్డు నమోదు చేసింది. 2009 నుండి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. వచ్చే ప్రపంచ కప్ ను 2024లో బంగ్లాదేశ్ లో నిర్వహిస్తారు. టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ , నాకౌట్ పద్దతిలో జరుగుతుంది. ప్రస్తుతం 10 జట్లు పాల్గొంటున్నాయి. అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసిస్(Australia Record T20 World Cup) నిలిస్తే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సుజీ బేట్స్ నిలిచింది.
మొత్తం 1,066 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ 43 వికెట్లు తీసింది వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచింది. మొదటి ఎడిషన్ 2009లో ఇంగ్లండ్ లో జరిగింది. తొలి సారిగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ కీవీస్ ను ఓడించి విజేతగా నిలిచింది. 2010లో వెస్టిండీస్ , 2012లో శ్రీలంక, 2014లో బంగ్లాదేశ్ , 2016లో ఇండియా , 2018లో వెస్టిండీస్ , 2020లో ఆస్ట్రేలియా, 2023లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
Also Read : ఐసీసీ వరల్డ్ కప్ విజేత ఆసిస్