Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ

ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ

Ayesha Meera : ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ (CBI) అధికారుల విచారణ ముగిసింది. ఏడేళ్ల నుంచి సీబీఐ అధికారులు ఈ కేసుని విచారణ చేశారు. 2018లో పున: విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మొదట సిట్‌ కి హైకోర్ట్ బాధ్యతలు అప్పగించింది. అయితే సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో సీబీఐ విచారణ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. దీనితో విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో సీబీఐ అధికారులు హైకోర్టుకి అందజేశారు. అయితే సీబీఐ కోర్టులో నివేదిక కాపీ అందించాలని సీబీఐకి హైకోర్ట్ ఆదేశించింది. ఈ కేసుని వచ్చే వారానికి ఏపీ హైకోర్ట్ విచారణ వాయిదా వేసింది.

Ayesha Meera Case Updates

కాగా, ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఫైనల్ రిపోర్ట్ వేసేందుకు హైకోర్ట్ అనుమతించింది. సీల్డ్ కవర్లో ఫైనల్ రిపోర్ట్ కాపీలను హైకోర్ట్‌కి సీబీఐ అధికారులు సమర్పించారు. వాటిని భద్రపరచాలని రిజిస్ట్రీకి ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2007 డిసెంబర్27వ తేదీన జరిగింది. తాను ఉంటున్న హాస్టల్‌ లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాగా ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో సత్యంబాబు అనే యువకుడ్ని నిందితుడిగా చేర్చి జైలులో పెట్టారు. అయితే సత్యంబాబు నిర్ధోషి అని తేలడంతో కేసును మళ్ళీ రీ ఓపెన్ చేసి అసలు నిందితులను పట్టుకోవాలని కోర్టు సీబీఐను ఆదేశించింది.

Also Read : Ministers: విశాఖ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు – ఇన్ ఛార్జ్ మంత్రి డోలా

Leave A Reply

Your Email Id will not be published!