Ayodhya Ram Mandir: ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు

ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు

Ayodhya Ram Mandir : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (అయోధ్య రామమందిరం) గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల పన్నులు చెల్లించింది. ఇక్కడికి నిత్యం వస్తున్న కోట్లాది మంది రామభక్తులతో అయోధ్యలోని రామమందిరం కిటకిటలాడుతోంది. మరీ ముఖ్యంగా మహాకుంభమేళా(Maha Kumbh Mela) సమయంలో వచ్చిన భక్తులతో శ్రీరాముని హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈసందర్భంగా శ్రీరామునికి వచ్చిన కానుకలు… అందులోంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుల వివరాలను రామ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. ‘ఆలయ పర్యాటకం’ వృద్ధి చెందడమే ఇందుకు కారణమని ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు ఈ మొత్తాన్ని చెల్లించినట్టు చెప్పారు. ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీగా, మిగిలిన రూ.130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్టు వివరించారు. రామ జన్మభూమి(Ayodhya Ram Mandir) తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక రికార్డులను కంప్ట్రోలర్ , ఆడిటర్ జనరల్ (CAG) అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారని చంపత్ రాయ్ అన్నారు.

Ayodhya Ram Mandir Tax..

కలియుగ పురుషుడు శ్రీరాముడు. అయోధ్య నివాసిగా పేరొందిన శ్రీరాముని ఆలయం కట్టించి సుమారు 5ఏళ్లు పూర్తి కావస్తోంది. రామాలయ ప్రతిష్ఠ (ప్రాణ ప్రతిష్ఠ) 2024 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశం అంతటా నుండి మత పెద్దలు, రాజకీయ ప్రముఖులు , వ్యాపార, వాణిజ్య ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరాముని జన్మస్థలంగా విశ్వసించే ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం అప్పటి నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షించి, ఒక ప్రధాన మతపరమైన , సాంస్కృతిక మైలురాయిగా మారింది. దీనితో అయోధ్యకు విచ్చేస్తున్న భక్తులతో పాటు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత సంవత్సరం అయోధ్యకు 16 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. 5 కోట్ల మంది రామాలయాన్ని సందర్శించారు. కేవలం మహా కుంభమేళా సందర్భంగా 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించారు. ఇదే విషయాన్ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

Also Read : Amit Shah: మిజోరాం ‘వండర్‌ కిడ్‌’కు అమిత్ షా స్పెషల్ గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!