Ayutha Chandi Yagam : చండీ యాగం ఆధ్యాత్మిక శోభితం
అంగరంగ వైభోగం చండీ యాగం
Ayutha Chandi Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో కొనసాగింది. లోక కళ్యాణం కోసం , యావత్ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ నిర్వహిస్తూ వచ్చారు.
Ayutha Chandi Yagam Viral
ఆగస్టు 14 నుండి జడ్చర్లలో ప్రారంభమైన ఈ యాగ ఉత్సవానికి భక్తులు తరలి వచ్చారు. స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. చండీ యాగం అతిరుద్రం కార్యక్రమంలో భాగంగా యాగ స్థలంలో శ్రీ సుదర్శన పూర్వక మహా మృత్యుంజయ, వరలక్ష్మీ సమేత మహా నారాయణ హోమాలు, సీతారాములకు విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
27న ఆదివారం 11.48 నిమిషాలకు మహా పూర్ణాహుతి, గురు పూజ, శ్రీకృష్ణ ఉట్టి కొట్టడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీరాధా కృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవంతో పూర్తవుతుంది. భక్తులు విశేషంగా పాల్గొని తరలించాలని స్వామి వారు కోరారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. భక్తులు తన్మయత్వంతో తరించి పోయారు. యాగం చేయడం వల్ల తమలో కూడా మార్పు మొదలైందని తెలిపారు భక్త బాంధవులు.
Also Read : TUDA Chairman : తుడా చైర్మన్ గా మోహిత్ రెడ్డి