Ayutha Chandi Yagam : అయుత చండీ యాగం భక్తసందోహం
కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
Ayutha Chandi Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. జడ్చర్ల(Jadcherla) లో ఆగస్టు 14న ప్రారంభమైన అయుత చండీ యాగం ఈనెల 27 వరకు జరగనుంది.
Ayutha Chandi Yagam Viral
స్వరూపానంద స్వామీజీ లోక కళ్యాణం కోసం , యావత్ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ యాగాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారి పర్యవేక్షణలో యాగ, పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజూ సామూహిక విశేష కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాదం అందజేస్తున్నారు నిర్వాహకులు.
సోమవారం మృత్యుంజయ రుద్ర, విజయ లక్ష్మీ హోమాలు చేపట్టారు. దశ సహస్ర విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు వివాహం కాని ఆడ, మగవారికి హోమాలు చేపట్టారు. ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకుల అర్చన చేపడతారు.
Also Read : YS Sharmila : జర్నలిస్టులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి