Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక !

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక !

Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న… కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రాబు కేబినెట్స్ లో పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు.

Ayyannapatrudu Chintakayala As A..

కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌ పోస్ట్‌ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ… టీడీపీనే ఆ పోస్ట్‌ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ బదులు జనసేనకు విప్‌ పోస్ట్‌ తో సరిపెట్టవచ్చని సమాచారం.

Also Read : CM Revanth Reddy: తెలంగాణా రైతులకు శుభవార్త ! రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ !

Leave A Reply

Your Email Id will not be published!