B Tech Fees TS : బీటెక్ విద్యార్థులకు ఫీజుల మోత
B Tech Fees TS : మంచి కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఫీజులు(B Tech Fees TS) భారం కానున్నాయి. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజుల మోత మోగనుంది.
వచ్చే మూడేళ్ల కు గాను భారీ స్థాయి లో ఫీజులు పెరిగే అవకాశముంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రవేశాలు – ఫీజు నియంత్రణ కమిటీ (TSFRC) ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి.
వృత్తి విద్యా కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షిస్తారు. కళాశాలల ఆదాయ, వ్యయాలు, మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చు బట్టి ఫీజులను నిర్ణయిస్తారు. 2019లో నిర్ణయించిన ఫీజు గడువు ఈ ఏడాది ముగియనుంది.
దీంతో వచ్చే మూడేళ్లకు (2022-23 నుంచి ) కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి.
ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TSRFC) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి.అయితే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ కొన్ని రోజులుగా కాలేజీలతో విడివిడిగా చర్చలు జరుపుతోంది.
ఇందులో టాప్‌టెన్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పెంపుపై భారీగా డిమాండ్ చేస్తున్నాయి. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. డిసెంబర్ నుంచి మొదలయ్యే 2022–23 విద్యా సంవత్సరంలో ఫీజుల పెంపుపై నెలలుగా కసరత్తు చేస్తోంది కమిటీ .
అయితే ప్రైవేటు కాలేజీల వాదనపై కొంత ఇబ్బంది పడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ . ప్రతీ ఏటా 10–15 శాతం ఫీజులు పెంచుతున్నారని. ఇప్పుడు ఏకంగా 25 శాతం అంటే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఎఫ్ఆర్సీ వర్గాలు అంటుండటం విద్యార్థులకు ఊరటనిచ్చేది. ఇదే విషయాన్ని కాలేజీల యాజమాన్యాలకు నచ్చజెప్పే యత్నం చేస్తోంది.
Also Read : జేఈఈ మెయిన్ తొలి విడతలో మనోళ్లే టాప్