Badrinath Prasad: భారత్‌ సహా 140 దేశాలకు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ప్రసాదం

భారత్‌ సహా 140 దేశాలకు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ప్రసాదం

Badrinath Prasad : చార్‌ధామ్‌ యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది భక్తులు ఉత్తరాఖండ్‌కు తరలివస్తుంటారు. అయితే, నిర్ణీత కాలం మాత్రమే దర్శనాలకు అనుమతిస్తుండడంతో అనేక మంది దర్శించుకునేందుకు అవకాశం ఉండదు. ఆ నేపథ్యంలో బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (BKTC) కీలక చర్యలు చేపట్టింది. ఈ రెండు ఆలయాల ప్రసాదాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు పంపించే ఏర్పాట్లు చేసింది.

Badrinath Prasad Distributed

బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ప్రసాదాన్ని దేశంలో ఏ ప్రాంతం వారైనా ఆర్డర్‌ చేసుకోవచ్చని, స్పీడ్‌ పోస్టు ద్వారా పంపిస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 24 గంటల నుంచి 72 గంటల్లోగా దేశంలో ఎక్కడికైనా పంపిస్తామని, విదేశాలకైతే ఆయా దేశాల దూరాన్ని బట్టి చేరుకుంటుందని తెలిపింది. బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ (BKTC) ఆఫీసులను సంప్రదించి ఇంటి నుంచే ప్రసాదాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా ఈ రెండు ఆలయాల నుంచి ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు.

Also Read : Red Fort: ఎర్రకోటలో కోట్లు విలువైన బంగారు కలశాలు చోరీ

Leave A Reply

Your Email Id will not be published!