Balakrishna Akkineni : అయ్యో బాబాయిని అలా అంటానా

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇచ్చిన న‌టుడు

Balakrishna Akkineni : దివంగ‌త అక్కినేనిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది న‌టుడు బాల‌య్య‌పై. ఆహాలో అన్ స్టాప‌బుల్ తో దుమ్ము రేపుతూ మ‌రో వైపు సినిమాల్లో వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వ‌స్తున్నాడు.

ఇక బాల‌య్య బాబు న‌టించిన వీర సింహారెడ్డి ఊహించ‌ని దాని కంటే ఎక్కువ క‌లెక్ష‌న్లతో రాబ‌ట్టింది. ఈ సంద‌ర్భంగా విజ‌యోత్స‌వ స‌భ‌ను నిర్వ‌హించారు. అక్కినేని నాగేశ్వ‌ర్ రావుపై నోరు జారారు బాల‌కృష్ణ‌(Balakrishna Akkineni) . దీనిపై అక్కినేని కుటుంబం పెద్ద ఎత్తున మండి ప‌డింది. నాగ చైత‌న్య ఏకంగా మా తాత‌య్య‌ను ఇలాగే అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

మ‌రో వైపు రాష్ట్ర మంత్రి, న‌టి ఆర్కే రోజా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అక్కినేనిపై నోరు పారేసుకున్న బాల‌య్య బాబు త‌న తండ్రి దివంగ‌త ఎన్టీఆర్ ను కూడా ఇలాగే అంటే ఊరుకుంటారా అని ప్ర‌శ్నించారు. గురువారం నంద‌మూరి బాల‌కృష్ణ తీవ్ర స్థాయిలో స్పందించారు. తన‌కు త‌న తండ్రి ఎన్టీఆర్ , ఏఎన్నార్ లు రెండు క‌ళ్లు అని పేర్కొన్నారు.

తాను అక్కినేనిని బాబాయి అని పిలిచే వాడిన‌ని తానంటే ఆయ‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అన్నారు. భాష‌లో యాస ఉండ‌డం వ‌ల్ల త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

మ‌రో వైపు బాల‌కృష్ణ సారీ చెప్పాలంటూ నాగార్జున‌, ఏఎన్నార్ ఫ్యాన్స్ రోడ్డెక్కారు..నిర‌స‌న‌లు చేప‌ట్టారు. స‌త్య సాయి జిల్లా హిందూపురంలో బాల‌య్య మీడియాతో మాట్లాడారు. ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : కీర‌వాణికి ద‌క్కిన ‘ప‌ద్మం’

Leave A Reply

Your Email Id will not be published!