Balasaheb Thorat : మహా వికాస్ అఘాడిలో ‘మద్దతు’ మంట
శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై కాంగ్రెస్ ఫైర్
Balasaheb Thorat : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే) బరిలో దింపిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించడం కలకలం రేపింది మహా వికాస్ అఘాడీలో.
నిన్నటి దాకా విపక్షాల కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది శివసేన. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఇదే సమయంలో శివసేన సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు ప్రకటించాడు. ఆపై బీజేపీ సపోర్ట్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో రెండున్నర ఏళ్లుగా మరాఠాలో కొలువు తీరిన మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కుప్ప కూలింది. ఈ తరుణంలో మొదటి నుంచి బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన విపక్షాల కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వకుండా ఉన్నట్టుండి మాట మార్చడంపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది.
ఇది పూర్తిగా మిత్ర ద్రోహానికి పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బాలా సాహెట్ థోరట్(Balasaheb Thorat).
ఏ పద్దతిన ఉమ్మడి ధర్మాన్ని కాదని బీజేపీ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తారంటూ నిప్పులు చెరిగారు.
ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు మద్దతు ఇచ్చే విషయంపై ఎందుకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీలతో ఎందుకు సంప్రదించ లేదంటూ ప్రశ్నించారు.
మరో వైపు కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ కూడా ఠాక్రేపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : రాష్ట్రపతి కోసం బీజేపీ ఆదివాసీ జపం