#OurFood : బాల్ రెడ్డి అసాధార‌ణ విజ‌యం అన్న‌దాత‌ల‌కు ఆద‌ర్శం

మ‌ధ్య‌ద‌ళారీ వ్య‌వ‌స్థ‌కు చెక్ రైతుల‌కు ప్రాఫిట్

Our Food : ఎవ‌ర‌న్నారు వ్య‌వ‌సాయం దండుగ అని..అది పండుగ అంటూ చేసి చూపించాడు..బాల్‌రెడ్డి. పొలం నుంచి పంట‌ల్ని వంట గ‌దిలోకి వ‌చ్చేలా చేశాడు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు త‌న వ్యాపారాన్ని విస్త‌రించేలా చేశాడు. క‌ళ్ల ముందు జ‌రిగిన స‌క్సెస్ స్టోరీ. ఈ ఏడాది నెలాఖ‌రు నాటికి ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నది అత‌డి టార్గెట్. రైతులు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించే పంట‌ల ఉత్ప‌త్తుల‌ను నేరుగా వినియోగ‌దారుల‌కు చేర్చాలంటే ఎన్నో ఇబ్బందులు. మ‌రెన్నో క‌ష్టాలు. చూస్తే పెద్ద త‌తంగం మిళిత‌మై ఉంటుంది.

ఇక్క‌డంతా మ‌ధ్య‌ద‌ళారీ వ్య‌వ‌స్థ బ‌లంగా వేళ్లూనుకుని పోయింది. పంట చేతిలోకి రావాలంటే మిల్ల‌ర్ల ద‌గ్గ‌ర‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లు, రిటైల‌ర్లు ..ఇలా మూడంచెల వ్య‌వ‌స్థ‌ను దాటుకుని రావాల్సి ఉంటుంది. అంతా చేరుకున్నాక‌..క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భిస్తుందో తెలియ‌దు. చేసిన అప్పులు భార‌మై పోతాయి.

ఉన్న ధాన్యాన్ని త‌క్కువ ధ‌ర‌కే అమ్ము కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దీంతో రైతులు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన బాల్ రెడ్డి త‌ను కూడా ఫీల్ అయ్యాడు. అంద‌రి లాగా జాలి కురిపించ‌లేదు. తనే రంగంలోకి దిగాడు. ఎక్క‌డ లోపం ఉందో..ఎందుకు రైతుల‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయో ప‌రిశీలించాడు.

ఎవ‌రి ప్ర‌మేయం లేకుండా పంట పొలాల నుంచే నేరుగా మార్కెట్‌లోకి తీసుకు వెళ్ల‌గ‌లిగితే చాల‌నుకున్నాడు. దీని వ‌ల్ల టైం కొంచెం ప‌డుతుంది. మ‌రోసారి ఆలోచించాడు. ఉన్న చోట‌నే గోదాములు నిర్మించి..ప్రాసెసింగ్ చేస్తే..అక్క‌డే ప్రాసెసింగ్ యూనిట్ల‌ను స్థాపిస్తే..ఇబ్బందులు పోతాయ‌ని గ్ర‌హించాడు.

తానే ఎందుకు స్టార్ట్ చేయ‌కూడ‌దంటూ..అవ‌ర్ ఫుడ్(Our Food )పేరుతో అంకుర సంస్థ‌ను స్థాపించాడు. అది ఇపుడు ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా స‌క్సెస్ అయింది. ఐదు రాష్ట్రాల‌కు విస్త‌రించింది. 85 ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేసింది. మ‌రో 500 కొత్త‌గా ఏర్పాటు చేయాల‌న్న దిశ‌గా సాగుతోంది. దీనికంత‌టికి బాల్ రెడ్డి కార‌ణం.

అగ్రిప్రెన్యూర్ స్టార్ట‌ప్ కింద దీనిని చేర్చాడు. వేస్టేజ్, నాణ్య‌త విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప‌క్కా తెలంగాణ‌. సూర్యాపేట జిల్లాలోని ఆత్మ‌కూర్ విలేజ్ అత‌డిది. వ‌రంగ‌ల్‌లోని ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ జాబ్ చేశాడు. టెక్నాల‌జీ సాయంతో వ్య‌వ‌సాయ రంగంలో మార్పులు తీసుకు రావాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఐఐఎం అహ్మ‌దాబాద్‌లో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశాడు. మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్ ర‌ఘు ప్ర‌సాద్, శ‌శికాంత్‌ల‌తో క‌లిసి 3 కోట్లు పెట్టుబ‌డితో 2016 సెప్టెంబ‌ర్‌లో అవ‌ర్ ఫుడ్ .ఇన్ ప్రారంభించారు. గ్రామీణ యువ‌త‌తో పొలం వ‌ద్ద‌నే ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయించి..ఆయా ఉత్ప‌త్తుల‌ను రెస్టారెంట్లు, హోట‌ల్స్, కేట‌రింగ్, వ్యాపార‌స్తులు, రిటైల‌ర్స్ కు విక్ర‌యిస్తోంది ఈ సంస్థ‌.

తెలంగాణ‌, ఏపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్, క‌ర్నాట‌క రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ (Our Food )కాగా..మ‌రికొన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నుంది అవ‌ర్ ఫుడ్. నెల‌కు 15 కోట్ల రూపాయ‌ల ఆదాయం గ‌డిస్తోంది. అంకురాల‌లో టాప్ రేంజ్‌లోకి దూసుకెళుతోంది. బాల్ రెడ్డి..హ్యాట్స్ ఆఫ్ యూ..!

No comment allowed please