Aryan Aviation: చార్‌ధామ్ యాత్రలో ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం
చార్‌ధామ్ యాత్రలో ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం
Aryan Aviation: ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్ యాత్ర కొనసాగుతున్న వేళ ఆర్యన్ ఏవియేషన్ (Aryan Aviation) కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించింది.
Ban Imposed – Aryan Aviation
ఆదివారం ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరింది. అదే సమయంలో ప్రమాదం జరిగింది. గౌరీకుండ్‌లో హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో అందులో చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చార్ ధామ్ యాత్ర కొనసాగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
యాత్రకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా జూన్ 15, 16 తేదీల్లో ఈ ప్రాంతంలో చార్టర్, షటిల్ హెలికాఫ్టర్ కార్యకలాపాలను నిషేదించింది. తాజాగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మరోసారి అప్రమత్తమైంది. అయితే.. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరుపుతోంది. కేదార్‌నాథ్ లోయలో సమీపంలో హెలికాఫ్టర్ కార్యకలాపాలను, UCADA కమాండ్-అండ్-కంట్రోల్ రూమ్ పనితీరును సమీక్షించడానికి నైపుణ్యం కలిగిన అధికారులను వెంటనే నియమించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ DGCAని ఆదేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read : Bridge Collapses: పూణెలో ఘోర ప్రమాదం ! ఇంద్రాయణి నదిపై వంతెన కూలి అనేక మంది గల్లంతు !
