Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం !

ఢిల్లీ ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం !

Delhi: కాలుష్యం వల్ల వివిధ రోగాలబారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రభుత్వం వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని చాలానే చూస్తున్నా.. సమస్య కత్తిమీద సాములా మారింది.

Delhi Air Pollution Issue

ఇప్పటికే సరిబేసి విధానంలో వాహనాలు నడిపే పద్ధతిని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. కాలుష్య కట్టడికి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగే వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు దీపావళి వేడుకలపై కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు విధించింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగానూ రాజధానిలో టపాసుల ఉత్పత్తి, అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. ఆన్‌లైన్‌లో టపాసుల అమ్మకం, సరఫరాపై కూడా నిషేధం వర్తిస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ(Delhi) పోలీసులు, కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖల సహకారంతో ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై జనవరి 1, 2025 వరకు నిషేధం అమలులో ఉంటుందని రాయ్ ప్రకటనలో పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం 21 ఫోకస్‌ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.

Also Read : AP Weather : కృష్ణా జిల్లాతో పాటు ఆ 7 జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!