Bandi Peddiraju: సీబీఐ అధికారి బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం
సీబీఐ అధికారి బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం
Bandi Peddiraju : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. సీబీఐ అధికారి బండి పెద్దిరాజు రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షం గ్రామానికి చెందిన పెద్దిరాజు (Bandi Peddiraju) ప్రస్తుతం సీబీఐ ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ లో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. 1993లో కానిస్టేబుల్ గా సీబీఐలో చేరిన ఆయన 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని… ఇప్పటి వరకు 150కి పైగా రివార్డులు దక్కించుకున్నారు.
Bandi Peddiraju – President Medal
రామర్ హెర్బల్ ఫ్యూయల్, పరిటాల రవి, న్యాయవాది సతీశ్ హత్య కేసుల దర్యాప్తులో పెద్దిరాజు కీలకంగా వ్యవహరించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు, బిట్స్ పిలానీ ఆన్‌లైన్ పరీక్ష కుంభకోణం, అంతర్జాతీయ ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపుల కేసు, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లను అనుకరిస్తూ అంతర్జాతీయ టెక్ సపోర్ట్ స్కామ్‌లు వంటి హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తులో పెద్దిరాజు కీలకపాత్ర పోషించారు. ఇటీవల NEET UG 2024 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా… 45 మంది నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్‌లను దాఖలు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏఎస్‌ఐ సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్‌ను ప్రెసిడెంట్ మెడల్స్‌కు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏపీలోని చినగంజాంకు చెందిన కె.రాజగోపాల్‌రెడ్డి, జి.మధుసూదనరావుకు ప్రెసిడెంట్ మెడల్స్ వరించాయి.
Also Read : TDP: ఒంటిమిట్ట, పులివెందులలో టీడీపీ ఘన విజయం
