Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్ట్
బొమ్మలరామారంలో టెన్షన్
Bandi Sanjay Arrest : పేపర్ లీక్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేగిన తరుణంలో ఉన్నట్టుండి పోలీసులు భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్(Bandi Sanjay Arrest) చేయడం కలకలం రేపింది. అర్ధరాత్రి తర్వాత కరీంనగర్ లో ఉన్న ఎంపీని పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న ప్రశ్నా పత్రాల లీకేజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. అంతే కాకుండా తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న 10వ తరగతి తెలుగు, హిందీ పరీక్ష ప్రశ్నా పత్రాలు బయటకు రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీజేపీ చీఫ్.
ఈ మొత్తం లీకుల వ్యవహారానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా అసలు దోషులను వదిలేసి అమాయకులను ప్రశ్నిస్తున్నారంటూ పేర్కొన్నారు. సిట్ కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ లీకులకు సంబంధించి చేసిన ఆరోపణలకు గాను తమ ముందు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బండికి నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన హాజరు కాలేదు. ఈ తరుణంలో ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండగా తనను అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay). ఆయనను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కేసీఆర్ ప్రభుత్వం మానవ హక్కులను కాల రాస్తోందని ఆరోపించారు బీజేపీ నాయకులు. ఇది పూర్తిగా రాచరిక పాలనను గుర్తు చేస్తోందన్నారు.
Also Read : జనసేన జెండా బీజేపీ ఎజెండా ఒక్కటే