Bandi Sanjay : కవిత అరెస్ట్ పై బండి కామెంట్స్
చట్టం ముందు అంతా సమానులే
Bandi Sanjay Kavitha Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసింది. తాజాగా ఆదివారం విచారణ పేరుతో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పర్చింది. ఇప్పటికే కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను కూడా చేర్చింది.
వారికి ఈ కేసులో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసింది. మొత్తం సౌత్ గ్రూప్ పేరుతో రూ. 100 కోట్లు మార్చారంటూ ఆరోపించింది. ఈ మొత్తం ఘటనపై సీరియస్ గా స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పై నిప్పులు చెరిగారు. తప్పు చేయకపోతే ఉలుకెందుకని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో సిసోడియా అరెస్ట్ అయితే బీజేపీకి ఏమిటి సంబంధం అని నిలదీశారు బీజేపీ స్టేట్ చీఫ్.
ఈ మద్యం కుంభ కోణంపై తాము ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. డిప్యూటీ సీఎం అరెస్ట్ అయితే స్పందించిన సీఎం కేసీఆర్ తన ముద్దుల కూతురు కవితకు(Bandi Sanjay Kavitha Scam) నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించ లేదని మండిపడ్డారు.
చట్టం ఒకరికి చుట్టం కాదని దాని ముందు అంతా సమానులేనన్నారు బండి సంజయ్. తాము ప్రజా సమస్యలపై ఆందోళన చేపడతామని చెప్పారు. 119 నియోజకవర్గాలలో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజా గోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెడతామన్నారు.
Also Read : ప్రీతి మృతిపై కమిటీ ఏర్పాటు చేయాలి