Bandi Sanjay Kumar: గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు !
గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు !
Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.
గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) మాట్లాడుతూ… ‘‘ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు.
Bandi Sanjay Kumar Comment
శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారు. కొండ మీద అరాచక పాలన ముగిసింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటాం. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని బండి సంజయ్ అన్నారు.
Also Read : Rahul Gandhi: ప్రధాని మోదీ మణిపూర్ ను సందర్శించాలి – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ