Bandi Sanjay : పోయేటోళ్ల‌ను ఆపం – బండి

కాంగ్రెస్ మునిగి పోయే నౌక‌

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా త‌మ పార్టీ నుంచి కొంద‌రు వెళ్లి పోతున్న‌ట్లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇదంతా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. ఒక వేళ గ‌నుక పోతామ‌ని అనుకునే వాళ్ల‌ను తాము ఆపే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ పార్టీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌న్నారు. అది మునిగి పోయేందుకు సిద్దంగా ఉన్న ప‌డ‌వ అని, దానిలో ఎక్కుతామంటే వారి ఇష్టానికి వ‌దిలి వేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ అత్యంత బ‌లంగా ఉంద‌న్నారు. తామేదో బ‌ల‌మైన పార్టీ అని నిరూపించు కోవాల‌నే ఉద్దేశంతో ఆ పార్టీ తెగ ప్ర‌చారం చేసుకుంటోంద‌న్నారు బండి సంజ‌య్(Bandi Sanjay).

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనే లేద‌న్నారు. కొంద‌రు కావాల‌ని త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని దానిని మానుకోవాల‌ని సూచించారు. త‌మ స‌త్తా ఏమిటో ఇప్ప‌టికే ఉప ఎన్నిక‌ల్లో తెలిసింద‌న్నారు బీజేపీ చీఫ్‌. ఒక‌రి గురించి ప‌ట్టించు కోవాల్సిన స‌మ‌యం త‌మ‌కు లేద‌న్నారు. త‌మ ఫోక‌స్ అంతా రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలా అధికారంలోకి రావాల‌నే దానిపై దృష్టి పెట్టామ‌ని చెప్పారు బండి. ఇత‌ర పార్టీల్లో రాజ‌కీయాలు ఉంటాయ‌ని కానీ త‌మ పార్టీలో హైకమాండ్ సుప్రీం అని పేర్కొన్నారు. పార్టీ ఏది నిర్ణ‌యిస్తే దానిని అమ‌లు చేయ‌డం త‌మ విధి అని స్ప‌ష్టం చేశారు .

Also Read : BRS CM KCR : అడ‌వి బిడ్డ‌ల‌కు పోడు భూముల ప‌ట్టాలు

Leave A Reply

Your Email Id will not be published!