Bandi Sanjay : ప్రజలను కలుస్తం పాదయాత్ర ఆపం – బండి
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ చీఫ్ ఆగ్రహం
Bandi Sanjay : కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తామన్నారు. తన పాదయాత్రకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చినందుకు హైకోర్టు ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు.
తాను నిర్మల్ జిల్లాకు వెళితే వచ్చే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. భైంసా ఏమన్నా తెలంగాణలో ఉందా లేక పాకిస్తానో ఉందా అని నిలదీశారు. తాను ఏమైనా వీసా గనుక తీసుకోవాలా అని మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay) .
రోజు రోజుకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి టీఆర్ఎస్ తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు. అందుకే తాను పాదయాత్ర చేపట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కార్యకర్తలపై పోలీసులు కొట్టారని ఆరోపించారు.
వాళ్లు విధులు నిర్వహించకుండా టీఆర్ఎస్ పార్టీకి గులాంలుగా మారారని ఫైర్ అయ్యారు. అల్లర్లకు పాల్పడింది ఎవరో, పీడీ యాక్టు పెట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. తాను భైంసాలో పాదయాత్ర చేపడితే ఇవన్నీ బయటకు వస్తాయనే నెపంతోనే తనను రాకుండా చూశారని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay) .
తాము ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయ పడుతోందని ప్రశ్నించారు స్టేట్ చీఫ్. ఎన్ని అడ్డంకులు కల్పించినా, అరెస్ట్ చేసినా చివరకు చంపినా తమ పాదయాత్ర మాత్రం ఆగదన్నారు బండి సంజయ్.
Also Read : అరెస్ట్ చేసేందుకే బస్సు తగుల బెట్టారు