భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యా లేక రౌడీ రాజ్యామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసం తెలంగాణ విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
శ్రీనిధి, గురునానక్ విద్యా సంస్థలు ప్రైవేట్ యూనివర్శిటీలుగా అబద్దపు ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు బంండి సంజయ్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 4,000 మంది విద్యార్థులను చేర్చుకున్నారని తీరా ఇప్పటి వరకు వారికి న్యాయం చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీరి వెనుక ఎవరు ఉన్నారనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
వాళ్ల భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని ఇకనైనా కేసీఆర్ మేల్కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీజేపీ స్టేట్ చీఫ్. ఈ సందర్భంగా అన్యాయంగా ఇరుక్కున్న విద్యార్థుల తరపున న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మద్దతుగా నిలిచారని వారిని పోలీసులు అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు బండి సంజయ్.
రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆపై లాకప్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. దీనికి కారణమైన ఏసీపీ శివ మారుతి, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్.
