Bandi Sanjay KTR : సవాల్ సరే కవిత లిక్కర్ స్కాం కథేంటి
కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్
Bandi Sanjay KTR : దమ్ముంటే దా ఏం కావాలో తీసుకో అన్నీ ఇస్తా, కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా తీసుకో. ఏ డాక్టర్లను తెచ్చుకుంటావో తెచ్చుకో..ఈడనే ఉంటా..ఎక్కడికీ పోను..శాంపిల్స్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానంటూ స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్(KTR).
తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు, డ్రగ్స్ మాఫియాకు తాను డాన్ అయినట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆపై సవాల్ విసిరారు. ఒక వేళ తాను ఇచ్చిన శాంపిల్స్ తప్పని తేలితే కరీంనగర్ నడి బొడ్డున నీ చెప్పుతో నీవే కొట్టుకుంటవా అని అన్నారు కేటీఆర్.
మంత్రి చేసిన సవాల్ పై స్పందించారు బండి సంజయ్. ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ముఖంలో ఎందుకో భయం కనిపిస్తోందన్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్(Bandi Sanjay).
గతంలో తన తండ్రి సీఎం కేసీఆర్ వేములాడ రాజన్న ఆలయానికి రూ. 400 కోట్లు ఇస్తానని ప్రకటించాడని ఇప్పటి దాకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
తాను ఎప్పుడో చేసిన సవాల్ కు ఇప్పుడు కేటీఆర్ స్పందిస్తే ఎలా అని ఎద్దేవా చేశారు. పదే పదే తన పాలన గురించి గొప్పగా చెప్పే మంత్రి కేటీఆర్ తన స్వంత చెల్లెలు కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాత్ర ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు వెల్లడిస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.
అదే పార్టీకి చెందిన ఎవరైనా తప్పు చేస్తే వేటు వేసే మీరు మరి కవితమ్మ విషయంలో ఎందుకు చేయడం లేదంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్ పటేల్.
Also Read : ఈడీ నిర్వాకం ఢిల్లీ స్కాం అబద్దం