Bandi Sanjay TSPSC : సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ డిమాండ్

Bandi Sanjay TSPSC Leak : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని గ‌న్ పార్క్ వ‌ద్ద భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ దీక్ష చేప‌ట్టారు(Bandi Sanjay TSPSC Leak). టీఎస్ పీస్సీలో చోటు చేసుకున్న మొత్తం వ్య‌వ‌హారంపై వెంట‌నే సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. అంత వ‌ర‌కు తాము పోరాటం చేస్తూనే ఉంటామ‌న్నారు బండి సంజ‌య్. భారీ ఎత్తున నిరుద్యోగులు, బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

దీంతో పోలీసుల‌కు , బీజేపీ శ్రేణుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు య‌త్నిస్తుండ‌గా ఓ కార్య‌క‌ర్త సొమ్మ‌సిల్లి ప‌డిపోయాడు. దీంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉండ‌గా దీక్ష‌ను ఉద్దేశించి బండి సంజ‌య్ (Bandi Sanjay) మాట్లాడారు. గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల‌ను మొత్తం ర‌ద్దు చేయాల‌ని , ప్ర‌స్తుతం ఉన్న చైర్మ‌న్ , స‌భ్యుల‌ను, కార్య‌ద‌ర్శిని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్‌. చైర్మ‌న్ కు తెలియ‌కుండా ఏ ప‌ని జ‌ర‌గ‌ద‌న్నారు.

కాన్ఫిడెన్షియ‌ల్ గా ఉండాల్సిన ఈ పేప‌ర్లు ఎలా లీక్ అయ్యాయో చెప్పాల‌న్నారు. దీని వెనుక పెద్ద‌ల హ‌స్తం ఉంద‌న్నారు. వారెవ‌రో తేలాల‌ని అన్నారు బండి సంజ‌య్. త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేస్తే ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డించి తీరుతామ‌ని హెచ్చ‌రించారు. తాము నిరుద్య‌గ అభ్య‌ర్థుల కోసం పోరాడుతుంటే సీఎం , మంత్రులు లిక్క‌ర్ దందాలో ఇరుక్కున్న ఎమ్మెల్సీ క‌విత లిక్క‌ర్ రాణిని ఎలా ర‌క్షించు కోవాల‌ని ఆలోచిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Also Read : బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!