Bandlaguda Laddu : రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
బండ్లగూడ లడ్డూ ధర రూ. 1 కోటి 26 లక్షలు
Bandlaguda Laddu : హైదరాబాద్ – భాగ్యనగరం శోభాయమానంగా మారింది. కొన్ని రోజుల పాటు నగరంలో కొలువుతీరిన గణనాథులు భక్తులకు దర్శనం ఇస్తూ నిమజ్జనం కోసం బయలు దేరాయి. ప్రతి చోటా అంగరంగ వైభవంగా స్వామి వారి ప్రసాదం (లడ్డూ) కోసం వేలం పాటలు కొనసాగుతున్నాయి.
Bandlaguda Laddu Auction Viral
లడ్డూను చేజిక్కించు కునేందుకు భారీ ఎత్తున భక్తులు పోటీ పడుతున్నారు. ఈసారి ఊహించని రీతిలో హైదరాబాద్(Hyderabad) నగర వాసులు విస్తు పోయేలా వేలం పాట కొనసాగింది. నగరంలోని బండ్ల గూడలో ఏర్పాటు చేసిన వినాయకుడి వేలం పాట రికార్డు స్థాయికి చేరుకుంది.
ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. ఈ వేలం పాట కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో జరిగింది. విల్లా లోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఈ లడ్డూను స్వంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా గత ఏడాది 2022లో ఇదే కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో జరిగిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో రూ.60.80 లక్షలు పలుకగా ఈసారి అంతకు రెట్టింపు పలకడం విశేషం.
మొత్తంగా వినాయక నిమజ్జనం సందర్బంగా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి చంద్రబాబు జపం