Bangalore News : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు హైకోర్టులో చుక్కెదురు

ప్రజ్వల్‌ తరపున న్యాయవాది జి ఆరుణ్‌ వాదనలు వినిపించారు...

Bangalore News : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. లైంగిక దాడులకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ మూడు కేసులలో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. దీంతో ప్రజ్వల్‌ రేవణ్ణకు(Prajwal Revanna) మరింత కాలం జైలులోనే గడపక తప్పదని నిర్ధారించినట్లు అయ్యింది. రెండు అత్యాచార కేసులతో పాటు మహిళ అశ్లీల దృశ్యాలను రికార్డు చేసుకున్న వివాదానికి సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. మూడు కేసుల నుంచి విముక్తి పొందేందుకు ప్రజ్వల్‌ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి ఎం నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

Bangalore News Update

ప్రజ్వల్‌ తరపున న్యాయవాది జి ఆరుణ్‌ వాదనలు వినిపించారు. దర్యాప్తు జరుపుతున్న సిట్‌ తరుపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రొఫెసర్‌ రవివర్మకుమార్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతానికి దాఖలు చేసిన మూడు కేసుల బెయిల్‌ పిటిషన్లను ధర్మాసనం కొట్టవేసింది. హాసన్‌ జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలిపై అత్యాచార కేసులో బెయిల్‌ పిటిషన్‌పై రెండురోజులలో తీర్పు ప్రకటిస్తామన్నారు. ఒకవేళ ఈకేసులో బెయుల్‌ మంజూరైనా మిగిలిన కేసుల్లో బయటకు వచ్చే అవకాశం లేనట్లు అయ్యింది. ప్రజ్వల్‌ రేవణ్ణ 4 నెలలకుపైగా జైలులోనే గడుపుతున్నారు. బెయిల్‌కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ సాగింది.

Also Read : Jharkhand Elections : ఆపరేషన్ హేమంత్ సోరెన్ తో మారుతున్న ఊహాగానాలు..

Leave A Reply

Your Email Id will not be published!