Barrelakka : బరా బర్ బరిలో ఉంటా
ప్రకటించిన బర్రెలక్క
Barrelakka : కొల్లాపూర్ – ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క కీలక వ్యాఖ్యలు చేసింది. దాడులు చేసినా, కేసు నమోదు చేసినా అదర లేదు భయపడ లేదు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టించింది. గెలవలేక పోయినప్పటికీ గౌరవప్రదమైన ఓట్లను సాధించింది.
Barrelakka Comment
బర్రెలక్కకు 5,734 ఓట్లు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సారథిగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులలో కొందరికంటే ఎక్కువగా ఓట్లు సాధించింది. ప్రధాన పార్టీలు భారీ ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి. డబ్బులను వెదజల్లారు. మద్యాన్ని పంపిణీ చేశారు. తాయిలాలు ప్రకటించారు. లెక్కకు మించి హామీలు ఇచ్చారు.
సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బర్రెలక్క తాను బరిలోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల అనంతరం బర్రెలక్క మీడియాతో మాట్లాడారు.
40 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన తాను తన వాయిస్ ను వినిపిస్తూనే ఉంటానని ప్రకటించారు.
Also Read : CM KCR : ఓటమిపై కేసీఆర్ పోస్టుమార్టం