Barrelakka Attack : బర్రెలక్క శిరీషపై దాడి
కొల్లాపూర్ లో పరిస్థితి ఉద్రిక్తం
Barrelakka : కొల్లాపూర్ – స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో బరిలో నిలిచిన బర్రెలక్క శిరీష ప్రచారం చేస్తుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు సోదరుడు, తన టీం తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కలకలం రేపింది. ఇప్పటికే బర్రెలక్కగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 40 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగుల కోసం తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Barrelakka Attack Viral
బర్రెలక్క అసలు పేరు శిరీష. తను డిగ్రీ వరకు చదువుకుంది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ స్వస్థలం.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఉన్నట్టుండి గుర్తు తెలియని దుండగులు శిరీషతో పాటు సోదరుడిపై దాడికి పాల్పడ్డారు.
నిరుద్యోగుల కోసం బరిలో నిలిచిన బర్రెలక్కకు అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. ఒకానొక దశలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్(Congress) , బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులు జూపల్లి కృష్ణారావు, బీరం హర్ష వర్దన్ రెడ్డి, సుధాకర్ రావుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో ఉండడం ఆశ్చర్య పోయేలా చేసింది.
సామాజికవేత్తలు, కుల, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు సైతం బర్రెలక్కకు స్వచ్చంధంగా మద్దతు ప్రకటించారు.
Also Read : Minister KTR : కాంగ్రెస్ ఓటేస్తే 50 ఏళ్లు వెనక్కి