Basaveshwara : సంఘ సంస్కర్త స్పూర్తి ప్రదాత
బసవేశ్వరుడు రాజనీతిజ్ఞుడు
Basaveshwara : కర్ణాటకలో పేరొందిన సంఘ సంస్కర బసవేశ్వరుడు(Basaveshwara) . అందరూ ఆయనను బసవన్న అని పిలుస్తారు. 12వ శతాబ్ధానికి చెందిన కవిరేణ్యుడు. రాజనీతిజ్ఞుడు. తత్వవేత్త, కవి, శివ కేంద్రీకృత భక్తి ఉద్యమంలో లింగాయత్ సంఘ సంస్కర, కళ్యాణి చాళుక్య , కలచూరి పాలనలో హిందూ శైవ సంస్కర్తగా పేరు పొందారు బసవేశ్వరుడు. భారత దేశంలోని కర్ణాటకలో రాజు బిజ్ఞల -1 పాలనలో అతడి ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంది.
వచనాలుగా ప్రసిద్ది చెందిన బసవన్న తన కవిత్వం ద్వారా సామాజిక అవగాహనను వ్యాపింప చేశాడు. లింగ వివక్ష, సామాజిక వివక్ష , మూఢ నమ్మకాలు, ఆచారాలను తిరస్కరించాడు. కానీ శివుని పట్ల ఒకరి భక్తని నిరంతరం గుర్తు చేసేందుకు , ప్రతి వ్యక్తికి పుట్టుకతో సంబంధం లేకుండా శివ లింగం చిత్రంతో కూడిన ఇష్ట లింగ హారాన్ని పరిచయం చేశాడు బసవేశ్వరుడు. అహింసను ప్రోత్సహించాడు. హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని పిలుపునిచ్చాడు. మానవ, జంతు బలులను ఖండించాడు.
తన రాజ్యంలో అనేక సంస్కరణలను తీసుకు వచ్చాడు. అనుభవ మంటప పేరుతో ఏకంగా ఆధ్యాత్మికతకు సంబంధించి శాఖను ఏర్పాటు చేశాడు. ఆధ్యాత్మిక, ప్రాపంచిక ప్రశ్నలను చర్చించేందుకు అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుండి పురుషులు, స్త్రీలను స్వాగతించింది. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో బసవేశ్వరుడి(Basaveshwara) జీవితం, ఆలోచనల గురించి ప్రస్తావించారు.
బసవేశ్వరుడి బోధనలతో లక్షలాది మంది ప్రభావితం అయ్యారు. కన్నడ నాట ఆయనను స్మరించుకోని వారంటూ ఉండరు. ఆయన కాలం చేసినా నేటికీ బసవన్న బోధనలు నిత్యం స్పూర్తి దాయకంగా మారాయి.
Also Read : బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడు