Bathukamma Festival: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు ?

గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు ?

Bathukamma Festival : బతుకమ్మ పండుగను గొప్ప కార్నివాల్‌ గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Bathukamma Festival Updates

‘‘ఈనెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ సాధించే లక్ష్యంతో ఈనెల 29న ఎల్బీస్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తాం. పీపుల్స్‌ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా వేడుకలుంటాయి. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం’’అని మంత్రి జూపల్లి తెలిపారు.

బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ పండుగ గురించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశవిదేశాలకు తెలిసేలా చేస్తామన్నారు. పర్యాటకశాఖ, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.

Also Read : Jagdeep Dhankhar: ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్

Leave A Reply

Your Email Id will not be published!