Rishabh Pant Samson : పంత్ కే ఓటు శాంసన్ పై వేటు
బీసీసీఐ నిర్వాకంపై ఆగ్రహం
Rishabh Pant Samson : ప్రతిభ కలిగిన ఆటగాడిని పక్కన పెట్టడం ఒక్క భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కే చెల్లింది. వరుసగా 11 సార్లు వైఫల్యం చెందినా రిషబ్ పంత్(Rishabh Pant) ను కొనసాగిస్తూ వస్తోంది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులే కాదు తాజా, మాజీ ఆటగాళ్లు సైతం నిప్పులు చెరుగుతున్నారు.
అయినా బీసీసీఐ తీరు మారడం లేదు. ఫక్తు రాజకీయాలకు కేరాఫ్ గా మారిన బీసీసీఐలో రాను రాను రాణించే ఆటగాళ్లకు భవిష్యత్తు ఉండదన్న అనుమానం నెలకొంది. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ తనదైన ముద్ర వేసిన సంజూ శాంసన్ ను పక్కన పెట్టడం విస్తు పోయేలా చేసింది. పలు అనుమానాలకు తావిస్తోంది.
ట్విట్టర్ లో గత కొంత కాలం నుంచి భారత జట్టు కంటే బీసీసీఐని, దాని చీఫ్ , సెక్రటరీ రోజర్ బిన్నీ, జే షాతో పాటు తాత్కాలిక కెప్టెన్లు పాండ్యా, ధావన్ , కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ లను ఏకి పారేశారు. విచిత్రం ఏమిటంటే పూర్తి గణాంకాలతో సహా ఎవరు ఎలా ఆడుతున్నారనేది కూడా పేర్కొన్నారు.
ప్రముఖ కామెంటేంటర్లు హర్ష బోగ్లే, సైమన్ డౌల్ , రవి శాస్త్రి, క్రిష్ణమాచారి శ్రీకాంత్ , కపిల్ దేవ్ , అజహరుద్దీన్ తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బీసీసీఐపై. అంతే కాదు కనేరియా అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సంజూ శాంసన్(Sanju Samson) అద్భుతమైన ఆటగాడు. అతడి అటాకింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక వేళ శాంసన్ మా దేశంలో గనుక ఆడి ఉంటే ఇవాల్టికి మోస్ట్ పాపులర్ హీరోగా ఉండేవాడని పేర్కొన్నాడు.
Also Read : బంగ్లాదేశ్ భారత్ బిగ్ ఫైట్