Surya kumar Yadav : టి20 జ‌ట్టు కెప్టెన్ గా సూర్యా భాయ్

ఆసిస్ తో టీ20 సీరీస్ కు ఎంపిక‌

Surya kumar Yadav : ముంబై – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైజాగ్ తో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫ‌స్ట్ బ్యాంక్ 5 మ్యాచ్ ల టీ20 సీర‌స్ కోసం పురుషుల ఎంపిక క‌మిటీని ప్ర‌క‌టించింది. విచిత్రం ఏమిటంటే వర‌ల్డ్ క‌ప్ లో నిరాశ ప‌రిచిన సూర్య కుమార్ యాద‌వ్ కు కెప్టెన్సీ అప్ప‌గించింది.

Surya kumar Yadav as a T20 Captain

ప్ర‌క‌టించిన జ‌ట్టులో సూర్ కుమార్ యాద‌వ్ కెప్టెన్ కాగా రుతు రాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ , ఇషాన్ కిష‌న్ , య‌శ‌స్వి జైస్వాల్ , తిల‌క్ వ‌ర్మ‌, రింకూ సింగ్ , జితేష్ శ‌ర్మ (వికెట్ కీప‌ర్ ) , వాషింగ్ట‌న్ సుంద‌ర్, అక్ష‌ర్ ప‌టేల్ , శివ‌మ్ దూబే, ర‌వి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, అవేష్ ఖాన్ , ముఖేష్ కుమార్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.

ఇదిలా ఉండ‌గా రాయ్ పూర్ , బెంగ‌ళూరులో జ‌రిగే చివ‌రి రెండు టీ20 మ్యాచ్ ల‌కు శ్రేయాస్ అయ్య‌ర్ వైస్ కెప్టెన్ గా జ‌ట్టులో చేర‌నున్నాడు. మ్యాచ్ ల ప‌రంగా చూస్తే న‌వంబ‌ర్ 23న విశాఖ‌ప‌ట్నంలో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. 26న 2వ టి20 మ్యాచ్ తిరువ‌నంత‌పురంలో, 28న 3వ టి20 మ్యాచ్ గౌహ‌తిలో, డిసెంబ‌ర్ 1న 4వ టీ20 మ్యాచ్ రాయ్ పూర్ లో, డిసెంబ‌ర్ 3న టి205వ మ్యాచ్ బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నుంది.

Also Read : Kapil Dev Comment : క‌పిల్ ను మించిన దేశ భ‌క్తుడు ఎవ‌రు..?

Leave A Reply

Your Email Id will not be published!