Mohammed Shami : మహ్మద్ షమీకి మరో కొత్త షరతు పెట్టిన బీసీసీఐ

ప్రస్తుతం షమీ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ స్పోర్ట్స్ బృందంతో పాటు ఒక నేషనల్ సెలక్టర్ నిశితంగా పరిశీలిస్తున్నారు...

Mohammed Shami : టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) ఫ్యాన్స్ ఆశలకు మరోసారి బీసీసీఐ నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడి మధ్యప్రదేశ్ పై ఐదు వికెట్లు తీసి తన ఫిట్ నెస్, ఫామ్ ను ఏమాత్రం కోల్పోలేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. భారత మాజీలు, అభిమానులు షమీని ఆస్ట్రేలియాతో టెస్టుకు పంపించాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇవాళో రేపో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వస్తుందని వారంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే బీసీసీఐ ఇప్పుడు కొత్త కండీషన్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Mohammed Shami…

ప్రస్తుతం షమీ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ స్పోర్ట్స్ బృందంతో పాటు ఒక నేషనల్ సెలక్టర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు రాజ్ కోట్‌లో క్యాంపు నిర్వహిస్తున్నారు. షమీ స్పెల్ వేయగలడా? అతడి ఫిట్‌నెస్ ఎలా ఉంది అనే అంశాలను టీమ్‌మేనేజ్ మెంట్‌కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేరవేస్తున్నట్టు సమాచారం. అయితే, స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి క్లియరెన్స్ సెర్టిఫికెట్ వచ్చిన తర్వాతే షమీని భారత టెస్టులోకి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని బీసీసీఐ నివేదిక పేర్కొంది. తొలి టెస్టులో ఆసిస్ జట్టుపై ఘనవిజయాన్ని నమోదు చేసిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పింక్ బాల్ వార్మప్‌ను సైతం ఆడింది. ఈ నెల 6న ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్ధమవుతోంది.

Also Read : Home Minister Anitha : తిరుమలలో భక్తుల భద్రతపై హోమ్ మంత్రి కీలక ఆదేశాలు

Leave A Reply

Your Email Id will not be published!