Byzus Bcci ; భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే టాప్ ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ కంపెనీగా పేరొందిన బైజూస్ కు లైన్ క్లియర్ ఇచ్చింది.
ఈ మేరకు ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఖరారు చేసింది. మరో ఏడాది పొడిగించేందుకు ఓకే చెప్పింది. ఇదిలా ఉండగా స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సీరీస్ ముగిశాక బైజూస్ తో ఒప్పందం ముగుస్తుంది.
ఇందులో భాగంగా జెర్సీ ఒప్పందం చేసుకుంది సదరు కంపెనీ. ఈ నేపథ్యంలో బీసీసీఐ(Byzus Bcci )సమావేశమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్పాన్సర్ గా బైజూస్ ను మరో ఏడాది పాటు పొడిగించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది.
కాగా 2019 సెప్టెంబర్ నుంచి బైజూస్ భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అంతకు ముందు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా ఉండింది.
ఇక జెర్సీ స్పాన్సర్ షిప్ కింద భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఫీజు కింద బైజూస్ ఎడ్యుకేషనల్ సంస్థ ద్వైపాక్షిక సీరీస్ లకు రూ. 4.61 కోట్లు చెల్లిస్తోంది. ఇదే క్రమంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు గాను రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది.
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా బీసీసీఐకి పేరుంది. ఇప్పటికే రూ. 50, 000 వేల కోట్ల ఆదాయం 2024 వరకు రానుందని అంచనా.
ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ కు జెర్సీ స్పాన్సర్ షిప్ కు సంబంధించి భారీ ఎత్తున పోటీ నెలకొంది వివిధ సంస్థల నుంచి.
Also Read : రికీ పాంటింగ్ కంటతడి