Jasprit Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ప్రెజెన్స్ పై స్పందించిన బీసీసీఐ

అయితే సరిగ్గా గమనిస్తే దీనిపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు...

Jasprit Bumrah : టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో అభిమానులు ఆందోళన పడుతున్నారు. త్వరలో మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో ఈ తోపు బౌలర్ ఆడతాడో? లేదో? అని టెన్షన్ పడుతున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో గాయపడిన బుమ్రా ఇంకా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉన్నా రికవర్ కాకపోవడంతో అతడ్ని తప్పించింది. దీంతో అసలు బుమ్రా పరిస్థితి ఏంటి? అతడు రికవర్ అవుతాడా? లేదా? చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతాడో లేదోనని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే సరిగ్గా గమనిస్తే దీనిపై బీసీసీ(BCCI)ఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

Jasprit Bumrah-Champions Trophy

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో బుమ్రా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రీప్లేస్ చేసింది బీసీసీఐ. టీ20 సిరీస్‌లో రాణించడంతో వరుణ్‌ను తీసుకొచ్చారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వరుణ్‌ను ఈ సిరీస్ కోసమే కాదు.. చాంపియన్స్ ట్రోఫీ కోసం రీప్లేస్ చేశారని తెలుస్తోంది. బుమ్రా ఇప్పుడు ఆడలేదంటే చాంపియన్స్ ట్రోఫీ బరిలోనూ దిగడని వినిపిస్తోంది.అతడు గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ సాధన మొదలుపెట్టాలి. చాంపియన్స్ ట్రోఫీ ఇదే నెలలో జరగనుంది. ఇంత తక్కువ టైమ్‌లో అతడు కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టం. అందుకే అతడి ప్లేస్‌లో వరుణ్‌ను ఎంచుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బీసీసీఐ ఆడిస్తోందని సమాచారం. ఒకరకంగా బుమ్రా మెగా టోర్నీకి దూరమని బోర్డు హింట్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

Also Read : AP Govt : ఇకపై అమ్మ భాషకు ఓ కొత్త గుర్తింపు తీసుకురానున్న ఏపీ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!