BCCI Selectors : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపికపై ఉత్కంఠ
సెలెక్టర్ల పోస్టు కోసం భారీగా దరఖాస్తులు
BCCI Selectors : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు పేరంది. కోట్లాది రూపాయలు సంస్థలో మూలుగుతున్నాయి. లెక్కలేనంత డబ్బులు ఉన్నా ఈ మధ్య బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి.
ప్రధానంగా జట్ల ఎంపికలో వివక్ష చూపిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఆటగాళ్లను ఎంపిక(BCCI Selectors) చేస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి కేరళ స్టార్ సంజూ శాంసన్ వరుసగా రాణిస్తున్నా ఎందుకు ఎంపిక చేయడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో చావు దెబ్బ తిన్నది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. ఒక్క వికెట్ ను తీయలేక పోయారు బౌలర్లు. ఇదే సమయంలో బ్యాటర్లు కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లు అంతగా రాణించ లేదు.
దీంతో అటు కెప్టెన్ , ఇటు జట్టు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీసీసీఐ చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది. కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 28 వరకు డెడ్ లైన్ విధించింది. దీంతో భారత మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
వారిలో గతంలో భారత జట్టు తరపున ఆడిన నయన్ మోంగియా, మనీందర్ సింగ్ , శివ్ సుందర్ దాస్ , అజయ్ రాత్రా దరఖాస్తు చేసుకున్నట్లు టాక్. వీరిలో మోంగియా గతంలో సెలెక్టర్ గా పని చేశాడు కూడా. ఇక శివ సుందర్ దాస్ గతంలో భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది.
కొత్త వారిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలెక్షన్ అడ్వయిజరీ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది. మొత్తంగా శ్రీలంక టూర్ తో పాటు ఆసియా కప్ , భారత్ లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం జట్లను ఎంపిక చేసే బాధ్యత కొత్తగా ఎంపికయ్యే సెలెక్షన్ కమిటీ చేయనుంది.
Also Read : పాండ్యాకు టి20 రోహిత్ కు వన్డే..టెస్ట్ ఛాన్స్