RS100 Crore Seized : బెంగాల్ స్కాంలో రూ. 100 కోట్లు స్వాధీనం
ఫెడరల్ ఏజెన్సీ మొదటి ఛార్జిషీట్ దాఖలు
RS100 Crore Seized : మాజీ మంత్రి పార్థ ఛటర్జీ తో ముడిపడి ఉన్న పశ్చిమ బెంగాల్ ఉద్యోగాల కుంభకోణంలో ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా స్వాధీనం(RS100 Crore Seized) చేసుకున్నారు.
ఫెడరల్ ఏజెన్సీ ఈడీ కోల్ కతా లోని ప్రత్యేక కోర్టు ముందు ఈ కేసుకు సంబంధించి తన మొదటి ఛార్జి షీట్ ను దాఖలు చేసింది. ఇందులో అర్పితా ముఖర్జీ, పార్థ ఛటర్జీ లను నిందితులుగా పేర్కొంది.
ఇదిలా ఉండగా టీచర్ల స్కాంకు సంబంధించి ఏ ఏడాది ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకు జూలై 23న మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీని ఆయన సహాయకురాలు, పేరొందిన నటి అర్పితా ముఖర్జీలను అరెస్ట్ చేసింది.
వీరిద్దరికి సంబంధించిన ఇళ్లను సోదాలు చేసింది. కళ్లు చెదిరే నోట్ల కట్టలు బయట పడ్డాయి. నగదుతో పాటు 5 కేజీల బంగారు ఆభరణాలు, బంగారం కూడా దొరికింది.
ఇదిలా ఉండగా సెంట్రల్ ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ టీఎంసీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
అదే రోజున కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీఎంసీ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహచరి అర్పితా ముఖర్జీలకు సంబంధించి రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను సీజ్(RS100 Crore Seized) చేసింది.
ఈ దాడులు మొత్తం రాష్ట్రంలో కలకలం రేపాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న టీఎంసీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలంటూ డిమాండ్ చేసింది ఈడీ. దీనికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు మాజీ మంత్రి, ఆయన సహచరి.
Also Read : పశువుల మరణాలపై బీజేపీ ఆందోళన