Bengaluru Metro: మెట్రో స్టేషన్‌ లో ప్రేమికుల రొమాన్స్‌ ! సోషల్ మీడియాలో వైరల్ !

మెట్రో స్టేషన్‌ లో ప్రేమికుల రొమాన్స్‌ ! సోషల్ మీడియాలో వైరల్ !

Bengaluru Metro : మెట్రో స్టేషన్ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తూ మద్యం సేవిస్తూ… ఉడికించిన గుడ్డు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ మెట్రో అధికారులు తీవ్రంగా స్పందించడంతో… సదరు వ్యక్తి అది యాపిల్ ఫిజ్ అంటూ వివరణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అలాటి మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. బెంగుళూరు మెట్రో స్టేషన్(Bengaluru Metro) లోనే ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసాడు. దీనిని ఓ వ్యక్తి చిత్రీకరించి… సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Bengaluru Metro-Lovers..

బెంగళూరు మహానగరంలోని మెజెస్టిక్‌ మెట్రోస్టేషన్‌ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించారు. యువతి టీ షర్ట్ లో చేతులు పెట్టిన దృశ్యాలు ఎవరో మొబైల్‌ లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసారు. దీనితో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆ ప్రేమజంట ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్‌ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌ లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్‌ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్‌ మీడియాలో నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై బెంగుళూరు మెట్రో అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Also Read : CM Chandrababu Naidu: ఒంటిమిట్ట స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

Leave A Reply

Your Email Id will not be published!