#BerFruit : కీళ్ల నొప్పులు తగ్గాలంటే రేగుపండ్లు తినాల్సిందే..

ప్రస్తుతం ఇది రేగుపళ్ల సీజన్‌.

BerFruit  :  సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందువున్న ప్రతీ సీజన్లో దొరిగే పండ్లు, కూరగాయలను తప్పకుండ తినాలి. ప్రస్తుతం ఇది రేగుపళ్ల సీజన్‌. మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వివిధ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన రేగు పండు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది వీటిని అంతగా పట్టించుకోరు. తక్కువ ధరలోనే దొరికే రేగుపళ్లను ప్రతీ ఒక్కరు తప్పకుండ తినాలి.

రేగుపళ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగి వుంటాయి. రేగుపళ్లు జీర్ణశక్తికి, ఆకలి పెరుగుదలకు, రక్తహీనతను నివారించడానికి, విసుగు, నీరసం, శ్వాస నాళాల వాపు నెమ్మదించడానికి, గొంతునొప్పికి, హిస్టీరియా లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. రేగుపళ్లు తినడం వల్ల వాటిలోని సీ విటమిన్‌ శరీరానికి అంది, రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. చెడుకొవ్వు కరిగి పోతుంది.

రేగుపళ్లు తింటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా వుండేందుకు ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వారు ఈ పండ్లు తినడం మంచిది. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు ఈ పండ్లు తింటే వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

No comment allowed please