#Thyroid : థైరాయిడ్‌ ను అశ్రద్ధ చేస్తున్నారా ?

థైరాయిడ్‌ సమస్య ఆడవారిని బాధించే అతి పెద్ద సమస్యల్లో ఒకటి.

Thyroid  : థైరాయిడ్‌ సమస్య ఆడవారిని బాధించే అతి పెద్ద సమస్యల్లో ఒకటి. ఇది వారి జీవక్రియను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్‌ ఉన్నవారిలో అధిక బరువు, ఋతుస్రావం క్రమం తప్పడం, బద్ధకం, జుట్టు రాలడం, పొడిబారడం, మలబద్ధకం, అతిగా నిద్ర, నీరసం, ఆకలి ఇలాంటి అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి. అందువల్ల థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు అస్సలు అశ్రద్ధ చేయకుండా కొన్ని జాగ్రతలు తప్పనిసరిగా చేసుకోవాలి.

పప్పు దినుసుల్లో, గుడ్డులో ప్రోటీన్లు ఉంటాయి. వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. పీచు పదార్థం ఎక్కువుగా ఉన్న ఆహారాలు అంటే పళ్ళు, కాయగూరలు, తొక్క తీయని గింజలు, చిరుధాన్యాలు ప్రతి పూటా తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గుతుంది. మలబద్ధకం పోతుంది. దీనివల్ల ఆకలితో పాటు బరువు కూడా క్రమేపీ తగ్గుతుంది.

ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. హార్మోన్‌ బ్యాలెన్స్‌ ఉండాలంటే మాంసకృత్తులు చాలా ముఖ్యం. ఖర్జూరాలు, ఆకుకూరలలో రక్తశాతం పెంచే ఖనిజాలు ఉంటాయి. పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం ఉంటుంది. పీచు పదార్థం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాదు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చెయ్యాలి.

No comment allowed please