#Startups : తెలంగాణ‌లో దుమ్ము రేపుతున్న స్టార్ట‌ప్‌లు

చిన్న ఐడియా కోట్లు కొల్ల‌గొడుతోంది

Startups : చిన్న గ‌దిలో ప్రారంభ‌మైన ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడిగితే. అవి ఆచ‌ర‌ణ‌కు నోచుకుని వంద‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తే. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే భ‌లే బాగుంది అనిపిస్తుంది క‌దూ. ఇండియాలో మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక తెలంగాణ‌లో కేసీఆర్ సీఎం అయ్యాక సీన్ మారింది. అంతా స్టార్ట‌ప్ ల జ‌పం ఊపందుకుంది. ఏకంగా కోట్లాది రూపాయ‌లు ఫండింగ్ కోసం రా ర‌మ్మంటూ పిలుస్తున్నాయి. కొన్ని స‌క్సెస్ అయితే మ‌రికొన్ని ఆదిలోనే ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో టాప్ రేంజ్ లో ఉన్న స్టార్ట‌ప్ లు ఏమిటో చూద్దాం. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ స‌ర్వీస్ లో ఓ సంచ‌ల‌నం రెడ్ బ‌స్. ఇది స్టార్ట‌ప్ గా ప్రారంభ‌మై బిగ్ కంపెనీగా అవ‌త‌రించింది.

చ‌ర‌ణ్ ప‌ద్మ‌రాజు, సామ ఫ‌ణీంద‌ర్ రెడ్డి, ప‌సుపునూరి సుధాక‌ర్ దీని వ్య‌వ‌స్థాప‌కులు. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డ‌రింగ్ స‌ర్వీస్ లో స్విగ్గి టాప్ రేంజ్ లో ఉంటోంది. నంద‌న్ రెడ్డి, శ్రీ‌హ‌ర్ష మాజెష్టి దీనిని స్టార్ట్ చేశారు. మెబైల్ బేస్డ్ మినీ బ‌స్ ష‌టిల్ స‌ర్వీస్ క‌మ్ముట్ ను సందీప్ కాచ‌వ‌ర‌పు, చ‌ర‌ణ్ తోట‌, హేమంత్ జొన్న‌ల‌గ‌డ్డ‌, వ‌రికుటి, ప్ర‌శాంత్ గార‌పాటి స్థాపించారు. దీని ఆదాయం కూడా బాగుంది. ప‌ల్ల‌వ్ బ‌జ‌జూరీ, సందీప్ పొన్న‌గండ్ల సోష‌ల్ జ‌ర్న‌లిజం ప్లాట్ ఫాం తీసుకు రావాల‌ని స‌ద్దాహ‌క్ పేరుతో స్టార్ట‌ప్ స్టార్ట్ చేశారు. భాను ప్ర‌స‌న్న రాజు ఆన్ లైన్ కూప‌న్లు, డీల్స్ స‌ర్వీస్ సేవ‌లు అందించేందుకు గాను గ్రాబ్ ఆన్ ప్రారంభించాడు.

ఆ త‌ర్వాత స‌మోసా సోష‌ల్ మెస్సెంజ‌ర్ యాప్ ఇది కూడా పాపుల‌రే. దీనిని అభిలాష్ ఇనుమెల్ల‌, అభిమ‌న్యు పాముల‌పాటి, రాహుల్ రెడ్డి స్థాపించారు. ఫ్లాట్ పెబ్బెల్ ఇది వెడ్డింగ్ ఫోటోగ్ర‌ఫీ స్టార్ట‌ప్. ఇక టాలెంట్ స్ప్రింట్, హెలో క‌ర్రీ, షాప్ పిరాటే, జిఫ్ఫీ, మై డ్రీం స్టోర్, మేరా ఈవెంట్స్, నంబ‌ర్ మాల్, క‌స్ట‌మ్ ఫ‌ర్నిష్, మై స్మార్ట్ ప్రైజ్, లెర్న్ స్కూల్, ఇమాజినేట్ టెక్నాల‌జీ లాంటివి ప్రాఫిట్ లో న‌డుస్తున్నాయి. మీకు ఏదైనా ఐడియా ఉంటే ప‌ది మందికి హెల్ప్ అవుతుంద‌ని అనిపిస్తే ఇంకెందుకు ఆల‌స్యం స్టార్టప్ స్టార్ట్ చేయండి. మీకు మీరే బాస్ అవ్వండి.

No comment allowed please