#DrGCKavitha : సానుకూల దృక్పథం..విజయాని కి సోపానం

వేలాది మందికి స్వాంత‌న చేకూరుస్తున్న క‌విత

Dr GC Kavitha  : జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి..భిన్నంగా ఆలోచించ గలిగేలా మనల్ని మనం తీర్చి దిద్దు కోగలిగే సామర్థ్యాన్ని అలవరచు కోవాలి. కాలం ఎవరి కోసమూ ఆగదు. ఇంకొకరి కోసం వేచి చూడదు. అలా వెళ్లి పోతుందంతే. దానిని గుర్తించి, అందుకోగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. ఇదంతా ఊరికే వస్తుందా..కాదు ప్రతి రోజు మనం ఎలా శ్వాస పీల్చుకుంటామో దీనిని కూడా సాధన చేయాల్సిందే.

దైనందిన కార్యక్రమాలు, పనుల వత్తిళ్లు, చెప్పుకోలేని సమస్యలు..వీటన్నింటి మధ్య ఎప్పుడు ఉంటామో ..ఎక్కడికి వెళతామో తెలియని పరిస్థితి. ఇందు కోసం లేని తలనొప్పులు కొని తెచ్చు కోవడం, మామూలై పోయింది అందరికీ. ఏదైనా లైఫ్ చిన్నది. దీనిని మరింత సౌకర్యంగా, అర్థవంతంగా మలుచుకునే సౌలభ్యం మనలోనే ఉన్నది.

వేరే ఎక్కడో దొరుకుతుందని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. చేసేందుకు కొలువులు, సంపాదించేందుకు వనరులు, అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ ఏదో ఒక వెలితి వెంటాడుతోంది. ఇది వస్తు వ్యామోహం తో పాటు తమను తాము మరిచి పోవడం వల్ల కలుగుతోంది. ఈ అశాంతి నుంచి ఎలా అధిగమించాలో పాజిటివ్ లెర్న్ సంస్థ కృషి చేస్తోంది.. హైదరాబాద్ లో ఫెమస్ సైకాలజిస్ట్ గా పేరొందిన జి.సి.కవిత దీనిని స్థాపించారు.

ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ గా ఆమె ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫ్యామిలీ , పర్సనల్ కౌన్సిలింగ్ , పిల్లలకు గ్రూప్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఆమె. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో కూడా జనాన్ని మోటివేట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు రెదను లక్షలకు పైగా స్టూడెంట్స్ తో పాటు వేయి మంది టీచర్లకు కూడా శిక్షణ ఇచ్చారు.

సాఫ్ట్ స్కిల్స్ , బిహేవియర్ , తదితర అంశాలపై ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఈ రంగంలో జి.సి. కవితకు 15 ఏళ్ళ అనుభవం ఉన్నది. ఆమె స్పీచెస్ తో వేలాది మంది స్ఫూర్తి పొందారు. ఎర్లీ చైల్డ్ హుడ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పై ఆమెకు పట్టుంది. అమెరికన్ సైకలాజికల్ అసోషియేషన్ , ఇంటర్నేషనల్ పాజిటివ్ సైకాలజీ అసోషియేషన్ సభ్యురాలిగా ఉన్నారు.

సెంటర్ ఫర్ బ్రిటిష్ టీచర్స్ లో మాస్టర్ ట్రైనర్ గా ఎక్స్ పర్ట్. పాజిటివ్ టీచింగ్ అండ్ లెర్న్ పై మరింత పట్టు సాధించారు జి .సి .  కవిత. ఇండియా వ్యాప్తంగా , ఖతార్, కువైట్ , మస్కట్ దేశాలలో కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్నో అవార్డులు పొందారు. అటు పిల్లల్లో ఇటు టీచర్లలో సానుకూల దృక్పథాన్ని..పెంపొందించేలా చేస్తూ సాగిపోతున్న కవిత మరికొందరికి స్ఫూర్తి కలిగించాలని కోరుకుందాం.

No comment allowed please