Bhadrachalam: భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

భద్రాచలం రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

Bhadrachalam : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని… ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆలయ మరియు జిల్లా అధికారులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Bhadrachalam – CM Revanth Reddy

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో మిథిలా మండపంలో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఉదయం 10.30 గంటలకు కల్యాణ పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటల కొనసాగిన ఈ కళ్యాణోత్సవంలో… వేద మంత్రోచ్ఛరణ మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. జగత్‌ కల్యాణ శుభ సన్నివేశం. తలంబ్రాల వేడుక అనంతరం బ్రహ్మ బంధనం వేసారు. చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికి.. భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేసిన పతకాన్ని కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేయడం ద్వారా సీతారాముల కళ్యాణాన్ని ముగించారు.

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌

భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగిపోయింది. టీటీడీ తరఫున ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Also Read : Kunal Kamra: మూడోసారీ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన కునాల్‌ కమ్రా

Leave A Reply

Your Email Id will not be published!