Bhag Savari : వైభోగం భాగ్ సవారి ఉత్సవం
తిరుమలలో శ్రీవారికి పూజోత్సవం
Bhag Savari : తిరుమల – శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలలో ఒకటి భాగ్ సవారి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత భాగ్ సవారిని(Bhag Savari) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పురాణ ప్రాశస్త్యం ప్రకారం స్వామి వారి భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మ వారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామి వారిని పట్టుకో బోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.
Bhag Savari in Tirumala
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామి వారేనని విషయం గ్రహించి పశ్చాత్తాప పడుతాడు. వెంటనే అమ్మ వారిని బంధీ నుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేర వేస్తాడు. తన భక్తుని యొక్క భక్తికి మెచ్చి స్వామి వారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
అంతకు ముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్ సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారు పాల్గొన్నారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.24 కోట్లు