Mahavir Jayanthi : మహనీయుడు మహావీరుడు
ప్రతి ఏటా ఏప్రిల్ 4న నిర్వహణ
Mahavir Jayanthi : భగవాన్ మహావీర్ జయంతి ఇవాళ. ప్రతి ఏటా ఏ్రప్రిల్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులు ఘనంగా జరుపుకుంటారు. జైన సమాజం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మహావీర్ 24వ చివరి తీర్థంకురుడు. అంటే అర్థం జైన మతంలో రక్షకుడు లేదా ఆధ్యాత్మిక ప్రవక్త. హిందూ కాలమానిక ప్రకారం చైత్ర మాసం 13వ రోజున మహావీర్ జయంతి నిర్వహించడం ఆనవాయితీ. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మార్చి, ఏప్రిల్ లో వస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహిస్తున్నారు భగవాన్ మహావీర్ జయంతిని. భగవాన్ మహావీర్ అహంసను ప్రోత్సహించాడు. అన్ని జీవుల పట్ల గౌరవం , ప్రేమను బోధించాడు. ఈ విలువల ఆధారంగా జైన మతాన్ని స్థాపించాడు. జయంతి సందర్భంగా ప్రజలు ఊరేగింపు లేదా రథయాత్ర నిర్వహిస్తారు. మహావీరుని(Mahavir Jayanthi) విగ్రహాన్ని తీసుకు వెళతారు. విగ్రహానికి అభిషేకం చేస్తారు.
హింసకు దూరంగా ఉండండి. అహింసను పాటించండి. మానవ జీవితం అద్భుతమైనది. సేవ చేయండి. తోటి ప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండండి. జీవితాన్ని సత్యం, అహింస, బాహ్య కరుణతో నింపండి అని భగవాన్ మహావీర బోధించాడు. పవిత్రమైన పదాలు మీకు అంతులేని ఆనందానికి మార్గం చూపుతాయంటారు భగవాన్ మహావీర. ఆత్మ అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణకు కేంద్ర బిందువు అంటారు. అహింస గొప్ప మతం అని చెబుతారు.
Also Read : ఆర్టీసీ ఎండీకి భద్రాద్రి తలంబ్రాలు