Bhagwant Mann : పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం
జపాన్ ఐచి స్టీల్ కార్పొరేషన్ కు హామీ
Bhagwant Mann : పంజాబ్ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann). వర్దమాన్ స్టీల్ , జపాన్ కు చెందిన ఐచి స్టీల్ కార్పొరేషన్ ప్రతినిధులు సీఎం మాన్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన
వాతావరణం కల్పిస్తున్నట్లు చెప్పారు.
మౌలిక వసతులను కల్పించే బాధ్యత తమపై ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన
అనుమతుల్ని వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు భగవంత్ మాన్.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల కల్పనపై చర్చించారు. ఇన్వెస్ట్ చేసే వారికి తాము రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని, వారందరికీ ఉపాధి కల్పించాలని కోరారు.
ఈ మేరకు స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann). ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు సీఎం ప్రయత్నాలలో మునిగి పోయారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లడం కాదు ఇతర దేశాలు, ప్రాంతాల
నుంచి పంజాబ్ కు వచ్చేలా చేస్తానని ప్రకటించారు.
ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం. నిరుద్యోగ యువతకు స్కిల్స్ పెంపొందించేలా తీర్చి దిద్దుతామని వెల్లడించారు సీఎం.
Also Read : నూపుర్ శర్మకు కోల్ కతా కోర్టు సమన్లు