Bhanu Prakash Reddy : టీటీడీ నిధులు దారి మళ్లింపు
హైకోర్టులో పిటిషన్ దాఖలు
Bhanu Prakash Reddy : అమరావతి – ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు పక్కదారి పడుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
Bhanu Prakash Reddy Shocking Comments
కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా విరాజిల్లుతున్న ఈ పుణ్య క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. ప్రతి రోజూ కనీసం రూ. 3 కోట్లకు పైగా భక్తులు విరాళాలు, కానుకల రూపేణా వస్తోందని అన్నారు.
శుక్రవారం భాను ప్రకాశ్ రెడ్డి(Bhanu Prakash Reddy) మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించారని ఆరోపించారు. చట్ట విరుద్దంగా నిధులు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 100 కోట్లు మళ్లించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి.
టీటీడీ నిధులతో పనులు చేపట్టేందుకు 4 టెండర్లను ఏర్పాటు చేశారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి కానుకులను , విరాళాలను హిందూ ధార్మిక సంస్థలకు , కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.
Also Read : APPSC Group-1 : ఏపీలో గ్రూప్ -1 నోటిఫికేషన్ రిలీజ్