Bharat Slams Pakistan : ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భగ్గుమన్న భారత్
వారికి ఆ హక్కే లేదని ఎండగట్టింది...
Bharat : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారతదేశం పాకిస్థాన్‌పై ద్వారా విరుచుకుపడింది. గతనెల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో తప్పుడు ప్రచారం మొదలెట్టిందని తీవ్రంగా విమర్శించింది. “ప్రపంచ ఉగ్రవాద కేంద్రం” గా ఉన్న పాకిస్థాన్‌కు ఉగ్రవాదంపై ప్రసగించడం సిగ్గుచేటని.. వారికి ఆ హక్కే లేదని ఎండగట్టింది. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదని భారత్ పేర్కొంది. పాకిస్థాన్ ఈ చర్చల్లో పాల్గొనడం అంతర్జాతీయ సమాజానికి అవమానకరమని ఐక్యరాజ్యసమితిలో భారత(Bharat) శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానించారు.
Bharat Slams Pakistan in UN
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పౌరుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో పాకిస్తాన్ ప్రతినిధి “నీరు జీవనానికి ఆధారం. యుద్ధానికి ఆయుధం కాదంటూ” వ్యాఖ్యానించారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ.. దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాద్‌పై విరుచుకుపడ్డారు. “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా” ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకూ.. సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.
Also Read : Nepal Border : నేపాల్ బోర్డర్ లో సంచలనంగా మరీన ఉగ్రమూకల కదలికలు