Bhartruhari Mahtab: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ !

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ !

Bhartruhari Mahtab: లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. ముచ్చటగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో 18వ లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి లోక్ సభ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌(Bhartruhari Mahtab) వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఒడిశాలోని కటక్‌ నుంచి ఏడుసార్లు విజయం సాధించిన భర్తృహరి… స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని… ఆయనకు కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే)తో పాటు రాధామోహన్‌ సింగ్‌ (బీజేపీ), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఛైర్‌ పర్సన్‌ ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

Bhartruhari Mahtab As A…

భర్తృహరి మహతాబ్‌ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్‌ని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కటక్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఏడోసారి విజయ దుందుభి మోగించారు. మరోవైపు, 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్‌ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

Also Read : MLA KTR : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టీడీపీనే ఆపగలిగింది

Leave A Reply

Your Email Id will not be published!