Bhatti Vikramarka Mallu : పేదలకు ఇళ్ల నిర్మాణం
మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Mallu : హైదరాబాద్ – పేదలు, నిరుపేదలకు ఇళ్లు కట్టించి తీరుతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu). ఆనాడు తాను చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాలకు వచ్చిన సమయంలో ఇళ్లు లేని పేదలు తనను కలిశారని అన్నారు.
Bhatti Vikramarka Mallu Comment
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే ప్రతి లబ్దిదారుడికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు ఫారంను ప్రారంభిస్తామని చెప్పరు.
ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించామని తెలిపారు. ఇందులో ఇప్పటికే రెండింటిని అమలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఛాన్స్ ఇచ్చామన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య శ్రీ కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Also Read : Rahul Gandhi : కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం