Bhatti Vikramarka Mallu : భట్టికి డిప్యూటీ సీఎం ..?
సీఎం రేసులో కూడా
Bhatti Vikramarka Mallu : హైదరాబాద్ – ఎట్టకేలకు ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత కొంత కాలం నుంచీ ఎవరు పార్టీ పరంగా సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తో పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం రేసులో ఉన్నామని ప్రకటించారు.
Bhatti Vikramarka Mallu Position
ఈ ముగ్గురు కీలక నేతలు ఢిల్లీలో మకాం వేశారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందుగా ఎంపీ డీకే సురేష్ నివాసంలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో గంటకు పైగా సమావేశం అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని తనతో మరో నలుగురు ఐదుగురు పోటీలో ఉన్నామని, సీఎం పదవిని ఆశించడంలో తప్పు లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇదే సమయంలో మధిర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu) సైతం తాను కూడా రెడీగా ఉన్నానని అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తో చర్చించారు. మరో వైపు అధిష్టానం సీఎం గా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా భట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read : Uttam Kumar Reddy : పార్టీ నిర్ణయం శిరోధార్యం